టాలీవుడ్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట భారీ అగ్ని ప్రమాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన బ్యూటీ

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్వేతావర్మ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికపై స్వయంగా వ్యక్తపరిచింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా అవకాశాలను దక్కించుకొని బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా పాపులారిటీ అందుకుంది శ్వేతా వర్మ. తన డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ హౌస్‌కు రాకముందే పలు సినిమాల్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే ఈ సినిమాల ద్వారా స‌క్స‌స్ కాక‌పోయిన‌ తర్వాత బిగ్బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను దక్కించుకుంది.

తాజాగా శ్వేతావర్మ తన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం గురించి వివరించింది. ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం మా ఇంట్లో జరిగిందని.. కరెంట్ షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం నెలకొంది అంటూ వివరించింది. ఈ ప్రమాదంలో రూమ్ మొత్తం కాలిపోయిందని.. కాగా నా ఫ్యామిలీతో పాటు, నా పెట్స్ కూడా సేఫ్ గానే ఉన్నాయి. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి నేను కోల్పోవడానికి కొంత సమయం పడుతుంది. దయచేసి నాకోసం మీరు ప్రార్థించండి. మేము ఇప్పుడు బాగానే ఉన్నాము. టెన్షన్ పడవద్దు.. కొద్ది రోజులు తర్వాత మళ్లీ నేను సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతాను అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ ప్రియా రియాక్ట్ అయింది. నేను ఎప్పుడు నీకోసం ప్రార్థిస్తూనే ఉంటా శ్వేత అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే పలువురు అభిమానులు దీనిపై స్పందిస్తూ మీరేం టెన్షన్ పడకండి అంతా సర్దుకుంటుంది. ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అంటూ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Swetaa Varma (@swetaavarma)