ముసలోడితో సినిమానా..? చిరంజీవిని అవమానించిన ఎన్టీఆర్ హీరోయిన్..!? ఏం పోయే కాలమే నీకు..!?

యంగ్ జనరేషన్ కి ఒకప్పటి స్టార్ హీరోస్ విలువ తెలియడం లేదు. ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా హీరోలు.. గ్లోబల్ స్దాయి లో గుర్తింపు సంపాదించుకున్న హీరోలతోనే సినిమాల్లో నటించాలని చూస్తున్నారు. ఒకప్పుడు స్టార్స్ గా ఉన్న చిరంజీవి – వెంకటేష్ – బాలయ్య – నాగార్జునలతో యంగ్ బ్యూటీ సినిమాలకు ఒప్పుకోవడం లేదు. రీసెంట్గా అదే లిస్టులోకి వచ్చేసింది ఎన్టీఆర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జాన్వీ కపూర్ .

జాన్వి కపూర్ ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాలో నటిస్తుంది. సెకండ్ సినిమా కూడా సైన్ చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే రీసెంట్గా చిరంజీవి ఓకే చేసిన వశిష్ట సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర కోసం జాన్వి కపూర్ ని అనుకున్నారట వశిష్ట – చిరంజీవి . ఇదే విషయం బోనీకపూర్ కు చెప్పగా బోనీకపూర్ జాన్వికు ఎక్స్ప్లెయిన్ చేశాడట .

“అయితే పోయి పోయి ముసలోడితో సినిమా చేయమంటున్నావ్ ఏంటి డాడీ..?” అంటూ బోనీ కపూర్ పై ఫైర్ అయ్యిందట . అంతేకాదు ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ పాత్రగా కాకుండా దేవత పాత్రలో కనిపించడానికి సీన్ రాసుకున్నారట వశిష్ట. అయితే బోనీకపూర్ జాన్వి మాటలతో బాధపడిపోయి .. ఈ సినిమాను క్యాన్సిల్ చేసేసాడట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారింది. మెగా ఫాన్స్ జాన్వి కపూర్ ను ఏకిపారేస్తున్నారు . నీకు పోయేకాలం వచ్చింది అందుకే చిరంజీవితో సినిమాను వదులుకున్నావ్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!