కేవలం ఆ ఒకే ఒక పాట కోసం 365 రోజులు హౌస్ ఫుల్ అయిన సినిమా ఇదే…!!

ప్రస్తుతం సినిమా కల్చర్ మారిపోయింది. మూవీ చూసే తీరులో మార్పు వచ్చింది. ఒకప్పుడు థియేటర్కు సినిమా వచ్చిందంటే.. హిట్ టాక్ వినిపించేది. అలాగే 50 రోజులు, 100 రోజులు థియేటర్లలో ఆ సినిమా ఆడేది. కానీ ప్రస్తుత కాలంలో వారం రోజులు ఓ సినిమా థియేటర్లలో ఆడడమే కష్టమైపోయింది. ఇక హిట్ టాక్ విషయానికొస్తే నెల రోజులకు ఒకటి వినిపిస్తుంది. అయితే ఒక సినిమా మాత్రం ఏకంగా ఏడాది పాటు థియేటర్స్ లో రన్ అయిందని.. అది కూడా ఒక పాట కోసమే హౌస్ ఫుల్ అయ్యిందని ఎవరికైనా తెలుసా.

అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అవును ఇది సాధ్యమే. ” చినుకు చినుకు అందెలతో ” అనే పాట అందరూ చూసే ఉంటారు. ఈ పాట ఇప్పటికీ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో బాబు మోహన్ తో స్టార్ హీరోయిన్ సౌందర్య స్టెప్పులేసి అప్పట్లో అందరిని ఆకర్షించింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ ఈ పాట గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈయన మాట్లాడుతూ…” నేను థియేటర్కు వెళ్ళినప్పుడు అక్కడ నాది, సౌందర్యాది కలిసి ఒక పెద్ద కటౌట్ చూసి ఆశ్చర్య పోయాను. దానిమీద 365 రోజులు అని రాసి ఉంది. అది చూసి ఆశ్చర్యం కలిగింది. ఆ క్షణం నా జన్మ ధన్యమైపోయింది. కేవలం ” చినుకు చినుకు ” అనే సాంగ్ కోసం హౌస్ ఫుల్ అయిపోయిందట. సాంగ్ టైం కు ప్రేక్షకులు రావడం ఆ పాట అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లిపోవడం జరిగిందట. కేవలం ఆ ఒక్క పాట కోసం జనం ఎగబడ్డారు ” అంటూ చెప్పుకొచ్చాడు బాబు మోహన్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.