ధోని నుండి అదిరిపోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న నితిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు పొందిన నితిన్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాజాగా తాను నటిస్తున్న ఎక్స్ట్రాడినరీ సినిమా ప్రమోషన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు నితిన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరోయిన్ శ్రీ లీల కూడా ఇందులో నటించింది. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతంగా చేస్తోంది.

ఈ క్రమంలోనే నితిన్ వరుస ఇంటర్వ్యూ లతో బిజీగా ఉంటున్న సమయంలో నితిన్ కి అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ రావడం జరిగింది. అది కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నుంచి రావడంతో నితిన్ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. నితిన్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ ఫోటోలు ధోని ఆటోగ్రాఫ్ తో ఉన్నటువంటి టీ షర్టును పట్టుకొని స్మైలిస్తూ కనిపిస్తున్నారు నితిన్. ఇందులో బెస్ట్ విచ్ ఫేస్ నితిన్ అంటూ ధోని ఆటోగ్రాఫ్ ని చూడవచ్చు.

ఈ సర్ప్రైజ్ వల్ల నితిన్ తన ఆనందాన్ని తెలియజేస్తూ థాంక్యూ జానీ సార్ లవ్ యు అంటూ ఒక్క ట్వీట్ చేయడం జరిగింది.. ఈ ట్విట్ వైరల్ గా మారడంతో ఇంతకీ నితిన్ ధోని కి ఎక్కడ కలుసుకున్నారు.. అనే విషయం అభిమానులకు తెలియడం లేదు.. కానీ ధోని ఆటోగ్రాఫ్ తో ఉన్న టీ షర్టును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. భీష్మ సినిమా తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేదు నితిన్ మరి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.