వైరల్ అవుతున్న సూపర్ స్టార్ టీషర్ట్…వేలఎంతో తెలుసా?

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో, రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “యానిమల్ “. 200 కోట్ల భారీ బడ్జెట్ తో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిపి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 1 విడుదలకు సిద్దమవుతుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఐతే ఈ ఈవెంట్ కు మహేష్ ధరించిన టీ షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ టీ షర్ట్ ధర హాట్ టాపిక్ గా మారింది.

మహేష్ బాబు సినిమాలలో సూపర్ స్టార్ ఐనప్పటికీ, బయట చాలా సింపుల్ గా ఉంటారు. డ్రెస్సింగ్ విషయంలో సింపుల్ షర్ట్స్ అండ్ జీన్స్, టీ షర్ట్స్ ధరించి కనిపిస్తుంటారు. ఆడియో ఫంక్షన్లకు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సైతం ఇలానే వెళ్తుంటారు. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే జరిగింది. వేల మంది జనం మధ్యలో, ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్ కు మహేష్ బాబు సింపుల్ గా ఒక టీ షర్ట్, జీన్స్ ధరించి హాజరయ్యారు. మొదట ఇది చూసి సూపర్ అంటూ మెచ్చుకున్న అభిమానులు, ఆ టీ షర్ట్ ధర తెలిసాక మాత్రం అవాక్కవుతున్నారు. ఈ ఈవెంట్ కు మహేష్ లైట్ పింక్ కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్ ధరించారు. ఈ టీ షర్ట్ ధర అక్షరాలా 47 వేల రూపాయలు. ఇది తెలిసి కంగుతిన్నారు నెటిజన్లు. ఇది తెలిసాక “బాబు ఏది వేసుకున్న సూపర్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అనంతరం రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నారు మహేష్ బాబు.