JR.NTR: ఎన్టీఆర్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమాను రజనీకాంత్ రిజెక్ట్ చేశాడని తెలుసా..?

సౌత్ స్టార్ హీరో తలైవార్ రజనీకాంత్ కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్.. తనదైన స్టైల్ తో సూపర్ స్టార్ గా పాపులారిటి ద‌క్కించుకున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రజినీకాంత్ సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకున్నాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్‌లేని రజనీకాంత్ కు ఇటీవల జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ను క్రాస్ చేసి కొత్త రికార్డులను సృష్టించింది.

ఇక ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. అయితే రజనీకాంత్ కు గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రీమిక్ లో నటించే ఛాన్స్ వచ్చిందట. సింహాద్రి సినిమాను చూసిన రజిని 20 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ నటనను చూసి అంత అద్భుతంగా ఇంత చిన్న వయసులో ఎలా నటించాడని ఆశ్చర్య పోయాడట. భవిష్యత్తులో ఎన్టీఆర్‌కు సరిపడ కథలను రాయడమంటే చాలా కష్టమైన పని అంటూ కామెంట్ చేశాడట. అయితే రజనీకాంత్ సింహాద్రి మూవీలో ఎన్టీఆర్ నటన చూసిన తరువాత ఈ సినిమా రీమిక్స్ లో నటించే సాహసం చేయలేకపోయాడట.
తర్వాత కాలంలో ఆ సినిమాను విజయ్ కాంత్ రీమేక్ చేయగా అక్కడ ఈ సినిమా ఫ్లాప్ అయింది.

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే రజనీకాంత్ ఊహించినట్లుగానే ఎన్టీఆర్‌కు ఒక దశలో సరైన కథ‌లే రాలేదు. శక్తి నుంచి రభస సినిమా వరకు ఎన్టీఆర్‌కు వరుస ప్లాప్‌లు ఎదురయ్యాయి. దీంతో రజినీకాంత్ చేసిన కామెంట్స్ నిజమైనట్ల‌య్యింది. ఇక తర్వాత ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నటించడం ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఎన్టీఆర్ మూవీ సక్సెస్ లైన్ అప్ స్టార్ట్ అయింది. తర్వాత నుంచి ఎన్టీఆర్ కూడా వచ్చిన కథలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటా టాలీవుడ్ స్టార్ హీరోగా మారడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్న ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా స‌ముద్ర నేప‌ద్యంలో తెర‌కెక్కుతుంది.