ఆమె వల్లే బాలయ్యకు స్టార్ డమ్ వచ్చిందా..?

నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు మంచి మంచి చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత అనుకోకుండా కొన్ని సంవత్సరాలు కథల ఎంపిక విషయంలో పొరపాట్ల వల్ల వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్నారు.. కానీ ఇటీవలే మళ్లీ బాలకృష్ణ సరైన కథలు ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాపడుతున్నాయి. తన తదుపరి చిత్రాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరే విధంగా ప్లాన్ చేస్తున్నారు.


అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది విశ్లేషకులు సైతం బాలయ్యకు బ్రాహ్మణి పుట్టిన తర్వాతే ఎన్నో విజయాలు అందుకున్నారని ఆమె పుట్టుకతో బాలయ్యకు బాగా కలిసి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. బ్రాహ్మణి జాతకం మంచి జాతకమని ఆమె వల్లే కుటుంబ సభ్యుల కష్టాలు కూడా తగ్గిపోతాయని అనుకూలమైన ఫలితాలు కూడా వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య పొలిటికల్ కెరియర్ కంటే సినీ కెరీర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.

వచ్చే ఏడాది ఎన్నికల సమయానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. సరికొత్త లుక్ లో బాలయ్య ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు సమాచారం. కథల విషయంలో బాలయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే బాలయ్య బోయపాటి కాంబినేషన్లో అఖండ-2 సినిమాని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.