NC23 టైటిల్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాని కాపీ పేస్ట్ చేసేసారుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్ ని రివిల్ చేశారు మేకర్స్ . కాగా రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని గంటల ముందే ఆయన పుట్టినరోజుకు సంబంధించిన గిఫ్ట్ రివిల్ చేసేసారు మేకర్స్. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తన నెక్స్ట్ సినిమాను డైరెక్టర్ చందూముండేటి దర్శకత్వంలో కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే .

ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి సెలెక్ట్ అయింది . కాగా 2018లో గుజరాత్ నుంచి 21 మంది మత్స్యకారులు వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ చెరలో చిక్కుకుపోతారు. కాగా అందులో ఉన్న ఓ ఆంధ్ర మత్స్యకారుడి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అంటూ మేకర్స్ కూడా ప్రకటించారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని రివిల్ చేస్తూ తండేల్ అనే టైటిల్ను ఖరారు చేశారు .

దీనికి సంబంధించి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు . ఈ పోస్టర్లో చైతన్య సముద్రంలో పడవలో కూర్చొని కోపంగా కనిపిస్తాడు . ఫుల్ గడ్డం జుట్టు మాస్ లుక్ తో తన సినిమాకి సంబంధించి మంచి బజ్ క్రియేట్ చేశారు . అయితే ఇది చూసిన జనాలు ఇది అచ్చం దేవరా సినిమాకు సంబంధించిన పోస్టర్ లానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు కాపీ పేస్ట్ చేసేసావా డైరెక్టర్ అంటూ వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు..!!