ఆ మూవీ ఆడిషన్స్‌కి వెళ్తే రూ.25లక్షలు అడిగారు.. బిగ్ బాస్ స‌న్ని కామెంట్స్ వైర‌ల్‌..

బుల్లితెర యాక్టర్ స‌న్ని బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. ఈ సీజ‌న్‌లో బిగ్‌బాస్ విన్నర్ టైటిల్ ని కూడా గెలుచుకున్నాడు. ఇక సన్నీ ఇటీవల సినిమాలో హీరోగా నటించిన మూవీ సౌండ్ పార్టీ. హృతిక శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూన్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందింది. రవిపొలిశెట్టిచ‌ మహేంద్ర గజేంద్రచ‌ శ్రీశైలం గజేంద్ర ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రమోషనల్ ఈవెంట్లో వీజే స‌న్ని తన సినీ కెరీర్లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. కెరీర్ స్టార్టింగ్‌లో యాక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని.. అదే సమయంలో హ్యాపీడేస్ ఆడిషన్స్‌కు వెళ్తే రూ.25 లక్షలు డిమాండ్ చేశారని. అంత డబ్బు ఇచ్చే స్తోమ‌త లేక‌ ఆ సినిమా నుంచి తప్పుకున్నానంటూ వివరించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు సినిమాల కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.

ఇక గతంలో బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన సన్నీ ప్రస్తుతం నడుస్తున్న బిబి సీజ‌న్ 7.. టాప్ 5లో ప్రశాంత్, అమర్, ప్రిన్సీ యావర్, శోభాశెట్టి, శివాజీ ఉంటారంటూ జోష్యం చెప్పాడు. ఇక మొదట్లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ తర్వాత నటుడుగా మారి సీరియల్‌లో నటించాడు. తర్వాత అన్‌స్టాపబుల్.. సకలగుణాభిరామ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం సన్నీ సౌండ్ పార్టీతో ప్రేక్ష‌కుల‌ముందుకు రావ‌టానికి సిద్ధ‌మ‌యాడు.