” ప్రభాస్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ” సచిన్ టెండూల్కర్ కూతురు సారా పోస్ట్ వైర‌ల్‌…!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ సినిమా విడుదలవుతుంది అనగానే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. డార్లింగ్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే‌. ఇక ఇందులో ఒకటి ” సలార్ “. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి రావడంతో ఈ మూవీ టీం ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ ను మేకర్స్‌ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ ట్రైలర్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా ప్రభాస్ పై ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

” సలార్‌ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను ” అంటూ క్యాప్షన్ సైతం రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆమె ఓ పోస్టర్ను కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ” అయ్యబాబోయ్.. సారా.. నువ్వు కూడా ప్రభాస్ ఫ్యానేనా.. సూపర్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సారా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.