నాగార్జున రిజెక్ట్ చేసిన బాలయ్య ఫ్లాప్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో నందమూరి నట‌సింహ బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం వరుసహిట్లతో దూసుకుపోతున్న బాలయ్య ఇటీవల భగవంత్‌ కేసరితో హ్యాట్రిక్ హిట్టును తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఇటీవల వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్ల కలెక్షన్లు కొట్టిన బాలయ్య ప్రస్తుతం బాబి డైరెక్షన్లో సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

అయితే గతంలో నాగార్జున రిజెక్ట్ చేసిన ఓ సినిమాలో బాలయ్య నటించి ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి చూద్దాం. బాల‌య్య‌ హీరోగా.. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో రూపొందిన కృష్ణ బాబు మూవీ. ఈ సినిమాకు మొదట బాలయ్యను హీరోగా అనుకోలేదట. నాగార్జునతో ఈ సినిమా చేయాలని డైరెక్టర్ భావించాడట. అది నాగార్జునతో వర్కౌట్ అవ్వక బాలయ్య బాబును ఈ సినిమాకు ఒప్పించాడు. అయితే బాలయ్య బాబు ఈ సినిమాలో నటించి డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.

నిజానికి నాగార్జున చేయాల్సిన ఈ సినిమా బాలయ్య బాబు చేతికి ఎలా వచ్చిందో.. అనే అంశం ప్రస్తుతం షాక్ కలిగిస్తుంది. ఈ న్యూస్ బైర‌ల్ అవ్వ‌డంతో అసలు నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాలు బాలయ్య బాబు ఎలా ఒప్పుకున్నారు.. అనవసరంగా ఈ సినిమాతో భారీ దిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో ఏ సినిమాలో నటించలేదు. అదేవిధంగా ఈ సినిమా తర్వాత బాలయ్య తన కథ‌లు ఎంచుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అని తెలుస్తుంది.