బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే మనందరికీ సుపరిచితమే. ఈ బ్యూటీ కెరీర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. వ్యక్తిగతంగా మాత్రం దారుణమైన ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటుంది. ఆ ట్రోల్స్ కారణంగా ఒకానొక సమయంలో తనకు తాను ఆత్మ విశ్వాసం కోల్పోయిందట. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలని ఆరబోసే ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నేను ఇప్పటికీ నా శరీరం గురించి బాధపడలేదు. కానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. నన్ను మగాడిలా ఫ్లాట్ గా ఉన్నావు. నీ బాడీ షేప్ అబ్బాయిలా ఉంది అంటూ కామెంట్లు చేశారు. వారసత్వం ఉందని అబ్బాయిలా ఉన్న నువ్వు కూడా హీరోయిన్‌గా రాబోతున్నావా అంటూ అవమానించారు.
ఆ సమయంలో నేను పడిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. అలా పిచ్చివాగుడు వాగే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి నటి ఇలాంటి కామెంట్స్ కచ్చితంగా ఎదుర్కొంటుంది. అందుకే నన్ను నేను క్రూరంగా మార్చుకున్న.. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని బ్లాక్ చేసి పడేస్తున్న ” అంటూ పేర్కొంది. ప్రస్తుతం అనన్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.