“ఆ ఒక్క పని చేస్తే మహమ్మద్ షమీ ని పెళ్లి చేసుకుంటా”.. ఎన్టీఆర్ హీరోయిన్ ఇంతకు తెగ్గించేసింది ఏంటి..?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పాయల్ గోష్ ఎలా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా అప్పట్లో మీటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పాయల్ గోష్ ఆ తర్వాత పలువురు డైరెక్టర్ లు, హీరోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది . అంతేకాదు ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమా ద్వారా తెలుగులో కూడా పాపులారిటీ దక్కించుకున్న పాయల్ తాజాగా బాలయ్యను రేంజ్ లో పొగుడుతూ ట్వీట్ కూడా చేసింది .

ఇలాంటి క్రమంలోనే పాయల్ గోష్ తాజాగా ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీకి సంబంధించి ట్విట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.  ప్రెసెంట్ జరుగుతున్న వరల్డ్ కప్ సిరీస్ లో షమీ ఎంత కీలకంగా మారారో మనం చూసాం. ప్రపంచ కప్ 2023లో దుమ్ము దులిపేస్తున్నాడు.  ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడిన షమ్మీ ఏకంగా 16 వికెట్లు పడగొట్టి సిరీస్ లో టాప్ ఫైవ్ బౌలర్ల లిస్టులో చేరిపోయాడు .

రానున్న మ్యాచ్లో కూడా షమ్మీ పర్ఫామెన్స్ కీలకంగా మారుతుంది అంటూ నిపుణులు చెప్పుకొస్తున్నారు.  ఇలాంటి క్రమంలోనే షమ్మీకు పాయల్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది . “షమ్మీ నువ్వు ఇంగ్లీష్ ని మెరుగుపరచుకో నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను “అంటూ రాసుకుంది.  దీంతో ఇది చూసిన షమీ ఫాన్స్ పై మండిపడుతున్నారు . పెళ్లికి ఇంగ్లీష్ కి సంబంధం ఏంటి..? అసలు నీకు ఆయనతో కంపేర్ చేసుకునే స్ధాయి ఉందా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు.  దీంతో సోషల్ మీడియాలో ఇదే ట్వీట్ వైరల్ అవుతుంది..!!