ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” పుష్ప 2 “. ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇండియన్ సినిమా అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్న సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా షూటింగ్ సుకుమార్ అనుకున్న విధంగా పక్క ప్రణాళిక తో కంప్లీట్ చేస్తున్నాడు.
ఇక లేటెస్ట్ గా అయితే సినిమాలో మేకర్స్ కంప్లీట్ చేసిన ఓ మాసివ్ సీక్వెన్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గానే మేకర్స్ ఓ జాతరకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ అండ్ సాంగ్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేశారట. దీనిని ఓ భారీ సెట్టింగ్ లో కంప్లీట్ చేయగా దీని అవుట్ పుట్ అయితే సాలిడ్ గా వచ్చిందని సమాచారం.
అంతేకాకుండా ఈ సీక్వెన్సే సినిమాలో ఒక బెస్ట్ పార్ట్ గా నిలుస్తుందట. అంతేకాదు మేకర్స్ ఈ షార్ట్స్ చూసిన తర్వాత.. సుకుమార్, రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను ఈ సినిమా ద్వారా బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు.. అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ వార్త చూసిన ప్రేక్షకులు..” మా ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్న సినిమా రికార్డులు బద్దలు కొట్టడానికి భారీ స్కెచ్ వేసావు కదా సుక్కు. మరి నీ స్కెచ్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.