” తనకి అది ఒక్కటే ఎక్కువ “… సామ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నాగచైతన్య…!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అక్కినేని నాగచైతన్య తో కొన్నేళ్లపాటు ప్రేమలో ఉండి.. అనంతరం పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే 4 ఏళ్లు గడవకముందే ఏవో మనస్పార్ధాలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జంట ముఖాముఖాలు కూడా చూసుకోలేదు. ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయారు. ఇకపోతే నాగచైతన్య సినిమాలలో బిజీగా ఉండగా.. సమంత మయోసైటీస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.

ఇక ఇదంతా పక్కన పెడితే నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరయ్యాడు. మాజీ భార్య సమంతా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు. మీరు నటించిన హీరోయిన్స్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి? అని యాంకర్ ప్రశ్నించగా…” కృతి శెట్టి, పూజ హెగ్డే, సమంత గురించి చెప్పుకొచ్చాడు. సామ్ గురించి మాట్లాడుతూ..” సమంత ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ పని కంప్లీట్ చేస్తుంది.

తనకు విల్ పవర్ ఎక్కువ. హార్డ్ వర్కర్ కూడా ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా సమంత గతంలో బాలీవుడ్ ఇంటర్వ్యూలో చైతు గురించి అడగగా..” అతను నా మాజీ భర్త. ఇద్దరం ఒకే గదిలో ఉంటే కత్తితో పొడుస్తాను ” అంటూ చైతుపై దారుణమైన కామెంట్స్ చేసింది. వీరిద్దరి కామెంట్స్ చూసిన ప్రేక్షకులు…” వీరిద్దరి మాటలు చూస్తేనే తెలుస్తుంది.. సమంతా కి నాగచైతన్య అంటే ఎంత కోపమో. అలాగే చైతుకి సమంత అంటే ఎంత ఇష్టమో. చైతన్య చాలా మంచివాడు… సమంతనే తన జీవితాన్ని నాశనం చేసింది ” అంటూ ఫైర్ అవుతున్నారు ‌. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.