ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక పేర్లు మార్చుకున్న స్టార్ హీరోలు వీళ్లే..

చాలామంది నటీనటులు ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లను మార్చుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు స్వయంగా హీరోలే తమ పేర్లు మార్చుకుంటారు. మరికొన్నిసార్లు డైరెక్టర్స్ పేర్లను మారుస్తూ ఉంటారు. అలా పేర్లు మార్చుకోవడానికి చాలా కారణాలే ఉంటాయి. అయితే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తమ పేర్లను మార్చుకున్న సౌత్ స్టార్‌లు ఎవరో ఒకసారి చూద్దాం.

ప్రభాస్ :


పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.. అయితే ఇంతలాంగ్ నేమ్ ను సినిమాల్లో కంటిన్యూ చేయడం కష్టం అనే ఉద్దేశంతో ప్రభాస్ గా మార్చుకున్నాడు.

రాజమౌళి :


బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి కాగా ఎస్ ఎస్ రాజమౌళి అని షార్ట్ కట్ లో పిలుస్తూ ఉంటారు.

సూర్య :


సౌత్ స్టార్ హీరోగా తిరుగులేని పాపులారిటీ దక్కించుకున్న సూర్య అసలు పేరు శ్రావణ శివకుమార్ కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈయన పేరు సూర్య గా మారింది.

పవన్ కళ్యాణ్ :


ఈ పేరుకు టాలీవుడ్ లో ఉండే క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్‌ను ఇండస్ట్రీ లోకి రాకముందు కళ్యాణ్ బాబు అని పిలుస్తూ ఉండేవారు. అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత పేరు పవన్ కళ్యాణ్ గా మారింది.

ధనుష్ :


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సౌత్ లోనూ మంచి క్రేజ్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ధనుష్ అసలు పేరు వెంకటప్రభు కస్తూరి రాజా ఇండస్ట్రీ లోకి వచ్చాక ధనుష్ అని పిలుస్తున్నారు.

విజయ్ దళపతి :


సౌత్ స్టార్ హీరో విజయ్ కోలీవుడ్లో దళపతిగా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ దళపతి అసలు పేరు జోసఫ్ విజయ్ చంద్ర శేఖర్.

కమల్ హాసన్ :


లోకనాయకుడు కమల్ హాసన్ అసలు పేరు కూడా అది కాదట. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలా మార్చుకున్నారు. ఆయన అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్.

విక్రమ్ :


సౌత్ స్టార్ హీరో విక్రమ్ అసలు పేరు కెనడీ జాన్ విక్టర్. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తరువాత విక్రమ్ గా మార్చుకున్నారు.

రజనీకాంత్ :


సౌత్ స్టార్ హీరో రజనీకాంత్ కోలీవుడ్ లో ఎటువంటి క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ కి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్ కాగా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత రజనీకాంత్ గా మారింది.

చిరంజీవి :


ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవిగా మారింది.

మోహన్ బాబు :


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసలు పేరు కూడా అది కాదట. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సల నాయుడు.