బాలయ్య సినిమా అనసూయ.. నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందా ..? అంటే అవునని ఆన్సర్ వినిపిస్తుంది . మనకు తెలిసిందే జబర్దస్త్ మానేశాక అనసూయ సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . హిట్లు ప్లాపులు పక్కన పెట్టేసి ట్రోలింగ్ అస్సలు పట్టించుకోకుండా తనకు నచ్చిన సినిమాలను చూస్ చేసుకుంటూ వచ్చిన ఆఫర్స్ లో నటిస్తుంది .

ఈ క్రమంలోనే బాలయ్య బాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతుందట . ఇది పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర అని సమాచారం అందుతుంది . ఈ సినిమాలో బాలయ్య అనసూయ మధ్య డైలాగ్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంటాయట . దీంతో  సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

బాలయ్య ఫ్యాన్స్ కూడా అనసూయ  బాలయ్యతో  నటించే అవకాశం దక్కించుకోవడం గ్రేట్ అంటున్నారు .. అంతేకాదు అనసూయ లాంటి యాక్టర్ బాలయ్యతో నటిస్తే ఇంకా నేర్చుకుంటుంది అని బాలయ్య సినిమాలో అనసూయకు ఛాన్స్ రావడం నిజంగా గ్రేట్ అని .. ఆమె నటనను ప్రూవ్ చేసుకుంటుంది ఈ సినిమా ద్వారా అని ఆశిస్తున్నామని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు..!!