లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీర ధర ఎంతో తెలుసా..?

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తన ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ మెగా కుమారుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి వివాహం చేసుకొని మెగా కోడలిగా మారిపోయింది. ఇటు ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1వ తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లికి దాదాపుగా 120 మంది హాజరైనట్టుగా తెలుస్తోంది. నిన్నటి రోజున వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

వరుణ్ తేజ్ గోల్డ్ కలర్ షేర్వానీలో ఉండగా లావణ్య త్రిపాఠి ఎరుపు రంగు కాచివరం చీరలో అందంగా కనిపించింది. ఈ ఫోటోలు చూసిన తర్వాత లావణ్య త్రిపాఠి చీర గురించి ఎక్కువగా చర్చలు మొదలయ్యాయి. ఈ చీరను ఎవరు డిజైన్ చేశారు ధర ఎంత అనే విషయం పై పలువురు నెటిజెన్స్ గూగుల్ లో సెర్చింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ కాంచీవరం చీరను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు సాంప్రదాయం ప్రకారమే ఈ చీరను డిజైన్ చేశారట.. లావణ్య ప్రేమకు చిహ్నమైన ఎరుపును మంచి మనసును సూచించి గోల్డ్ ను కలిగి ఉన్న ఈ చీరను డిజైన్ చేసినట్లుగా సమాచారం అయితే ఈ చీర ధర దాదాపుగా 7 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ జంట మరో రెండు మూడు రోజులు ఇటలీలోనే ఉండి నవంబర్ 4వ తేదీన ఇండియాకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 5వ తేదీన హైదరాబాదులో రిసెప్షన్ పెట్టబోతున్నట్లు సమాచారం.