కొన్నిసార్లు మన లైఫ్ లో మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి. అది గుడ్ ఆర్ బ్యాడ్ అలా జరిగినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది . ప్రజెంట్ ఇప్పుడు అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది లావణ్య త్రిపాఠి . మెగా ఇంటి కోడలుగా మారిపోయిన లావణ్య త్రిపాఠి మరికొద్ది గంటల్లో హైదరాబాద్లో అడుగుపెట్టబోతుంది . ఇప్పటికే వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా లావణ్య త్రిపాఠి ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు తన నిజ జీవితంలో జరిగింది . అదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠి పిల్లలతో మాట్లాడుతూ ఓ డైలాగ్ చెపుతుంది. ఫస్ట్ పిల్లలు “లావణ్య అక్క మీ పెళ్లికి సినిమా వాళ్ళు వస్తున్నారంట కదా ..?”అంటూ అడుగుతారు . “చిరంజీవి కూడా వస్తున్నాడా..?” అంటూ ప్రశ్నిస్తారు .
దీనికి లావణ్య అవును అంటూ సమాధానం చెబుతుంది . “అప్పుడు పిల్లలు గ్యాంగ్ లీడర్ వస్తున్నాడంటరోయ్”.. అంటూ పరుగులు తీస్తారు . లావణ్య సినిమాలో ఆ డైలాగ్ చెప్పిన నిజ జీవితంలో తన పెళ్లికి మెగాస్టార్ ని రప్పించుకునింది . మెగాస్టార్ చేతుల మీదనే పెళ్లి జరిపించుకునింది . ఇంతకన్నా అదృష్టం మరొకటి ఉంటుందా అంటూ మెగా ఫ్యాన్స్ లావణ్య ను పొగిడేస్తున్నారు..!!