చంద్రమోహన్ మేనల్లుడు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అనే విషయం మీకు తెలుసా..?

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కి సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గారు నేడు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అపోలో హాస్పిటల్స్ లో తుది శ్వాస విడిచారు . అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్ళగా ఆరోగ్యం క్సీణించి అక్కడే తుది శ్వాస విడిచారు .

ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా చంద్రమోహన్ దాదాపు 932 సినిమాలకు పైగా నటించారు . 175 సినిమాలలో హీరోగా కనిపించారు . అయితే అంత పెద్ద స్టార్ స్టేటస్ నుండి ఆయన కూతుర్లు ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి రాలేకపోయారు. అయితే చంద్రమోహన్ స్వయాన సోదరి కొడుకు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ట్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు .

ఆయన మరెవరో కాదు శివలెంక కృష్ణ ప్రసాద్. శ్రీదేవి మూవీస్ బ్యానర్ అధినేత . చంద్రమోహన్ ప్రోధ్బలంతోనే.. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినట్లు స్వయాన ఆయన వివరించారు . చంద్రమోహన్ రాజేంద్రప్రసాద్ లతో చిన్నోడు పెద్దోడు అనే ఒక సినిమాను తీశారు .. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో ఆదిత్య 369, వంశానికొక్కడు ,ఊయల ,అనగనగా ఒక అమ్మాయి ,భలేవాడివి బాసు ,నాని జెంటిల్మెన్, సమ్మోహనం సినిమాలను తీశారు. అంతేకాదు రీసెంట్గా సమంత నటించిన యశోద సినిమాను సైతం తెరకెక్కించారు..!!