చిరు గాడ్ ఫాదర్ -2 .. మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..!!

మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమా ను చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ అనే సినిమాతో రీమేక్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని మలయాళం లో మోహన్ లాల్ నటించగా భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో నటించిన చిరంజీవికి ఫ్లాప్ గానే మిగిలింది. దీంతో ఈ సినిమా పైన చిరంజీవి పైన దారుణమైన ట్రోల్స్ వినిపించాయి .అయితే ఈ సినిమా సీక్వెల్ ను డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ ఇటీవలే ప్రకటించడం జరిగింది.

మోహన్ లాల్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని సైతం విడుదల చేయక భారీ రెస్పాన్స్ లభించింది.. ఇప్పుడు మరొకసారి మోహన్లాల్ ఇందులో డాన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. మళ్లీ కూడా గతంలో వచ్చిన లూసీఫర్ సినిమాలోని పాత్రలే లూసిఫర్ -2 సినిమాలో కూడా వీరే నటిస్తూ ఉన్నారు. అయితే ఈ పాత్రలను కొనసాగింపు ఉంటుంది అంటూ సమాచారం. అయితే ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు తాజాగా గాడ్ ఫాదర్-2 గా చిరంజీవి ఈ సినిమాని రీమిక్స్ చేస్తారా అంటూ అభిమానుల ఒక చర్చ కొనసాగుతోంది. లూసిఫర్-2 మలయాళం తో పాటు తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి అభిమానులు మాత్రం గాడ్ ఫాదర్-2 సినిమా చేస్తే ఇక చిరంజీవీ పరిస్థితి అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే తన క్రేజ్ మొత్తం డ్యామేజ్ అవుతోంది అంటూ తెలుపుతున్నారు. మరి ఈ విషయం పైన చిరంజీవి ఏమంటారో చూడాలి.