జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్ లో ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. ఏ హీరో అయినా ఒక్క సినిమాలో ఒక పాత్రను జీవించడం కామన్. కానీ ఒకే సినిమాలో ఎన్ని వేరియేషన్స్ అయినా చూపించగల సత్తా ఇప్పటి హీరోస్‌లో ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని చెప్పడంలో సందేహం లేదు. జై లవకుశ సినిమాలో ఒకేసారి మూడు వైవిద్య పాత్రల్లో నటించి తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ క్యారెక్టర్ లో జీవించేశాడు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్‌ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ తన నటనతో ఈ రేంజ్‌కు ఎదగడానికి శిక్షణ కూడా తీసుకున్నారు. ఏ రంగంలో ఆయిన ట్రైనింగ్ కావాలి. సినీ రంగంలో కూడా నటనపై ప్రావీణ్యత ఉండాలంటే శిక్షణ తప్పదు. కొంతమంది నటనలో జీవిస్తుంటారు. అయినా సరే వాళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అల న‌ట‌న‌లో మెలకువలు తెలుసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అలా స్టార్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక 20 సంవత్సరాల వయసులో స్టార్ట్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో నిలబడ్డాడు అంటే మామూలు విషయం కాదు.

అలా అతి చిన్న వయసులోనే స్టార్ట్ స్టేటస్ ను సొంతం చేసుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అయితే ఎన్టీఆర్ గురించి ప్రముఖ ట్రైనర్ అయిన భిక్షు కొన్ని విషయాలను వివరించాడు. ఈయన దగ్గర ఎన్టీఆర్ శిక్షణ తీసుకున్నట్లు చెప్పాడు. తన దగ్గర శిక్షణ తీసుకున్న వారు అత్యధిక ఎత్తులకు ఎదగార‌ని.. శిక్షణ ఇవ్వాలంటే రూ.20 లక్షల రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయనని మంచి శిక్షణ ఇవ్వడం వల్ల కొందరు మంచి నటులైతే.. మరికొందరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లు పెట్టి ఇంకాస్త మందిని ఇంప్రూవ్ చేస్తున్నారని భిక్షు చెప్పాడు.

Jr NTR’s Big Boss Show Launch Stills

అయితే ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్ కంటే ఒక్కసారి ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వలేనని అప్పుడు నేను ఇచ్చే ట్రైనింగ్కి న్యాయం జరగదని వివరించాడు. బాల రామాయణం సినిమా కోసం పదేళ్ల వయసులోనే ఎన్టీఆర్ అతని దగ్గర శిక్షణ తీసుకున్నారని.. అంతే కాదు ఎన్టీఆర్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడని.. భిక్షు చెప్పుకొచ్చాడు. హారర్ కథలు చెప్పి భయపెట్టే వాడినని న‌వ్వుకున్నాడు. ఇక గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీలో భిక్షు చిన్న పాత్రలో నటించాడట. ఇలా ఎన్టీఆర్ కు నటన నేర్పిన గురువే ఎన్టీఆర్ గురించి స్వయంగా చెప్పడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.