ఎన్టీఆర్ స్టార్ అందుకోవడం వెనుక ఉన్నది ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. 20 ఏళ్ల వయసులోనే స్టార్ స్టేటస్ ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పటికీ అభిమానులను ఫిదా అయ్యేలా చేస్తూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు యాక్టింగ్ లో ఇరగదీసేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ అలా నటించడానికి ఆయనకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి కారణమని తెలుస్తోంది.ఆయన ఎవరో కాదు భిక్షు అనే వ్యక్తి దగ్గర ఎన్టీఆర్ శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

భిక్షు అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన దగ్గర శిక్ష తీసుకొని ఎదగాలనుకునే వారికి వర్క్ విషయంలో తన భార్య కూతురు సహాయం చేస్తారని తెలిపారు.. తనకి డబ్బులు విషయంలో ఎలాంటి డిమాండ్ చేయనని ఆయన తెలియజేశారు. తన దగ్గర స్టూడెంట్స్ గా కొంతమంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి మరి మరి శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. అయితే తన దగ్గర స్టూడెంట్ గా ట్రైనింగ్ తీసుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని తెలిపారు

బాల రామాయణం సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ పదేళ్ల వయసులో శిక్షణ తీసుకున్నారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ బాగా అల్లరి చేసే వారిని హర్రర్ కథలు చెప్పి చాలామంది పిల్లలను సైతం ఎన్టీఆర్ భయపెట్టేవారని భిక్షు తెలిపారు. ఈ విధంగా తారక్ తన దగ్గర శిక్షణ తీసుకొని మంచి పొజిషన్లో ఉన్నారని తెలిపారు తారక్ ఎవరైనా సరే మర్యాదపూర్వకంగానే మాట్లాడుతారని తెలిపారు. జనతా గ్యారేజ్ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో నటించాలని తెలియజేయడం జరిగింది బిక్ష..