శ్రీ లీలను అలాంటి ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టిన‌ నెటిజన్.. అదిరిపోయే సమాధానం ఇచ్చిందిగా..

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు వినిపిస్తుంది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ లీల రవితేజ సరసన ధ‌మాకా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ క్రేజీ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి ప‌లు టాప్ హీరోల‌తో నటించే అవకాశాల్ని అందుకుంది.

ఇక ఇటీవల బాలయ్యతో నటించిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమెకు అవకాశాలు మరింత పెరిగాయి. ఇదే ఊపులో శ్రీ లీల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచిందంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇక సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇందులో భాగంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఒక నెటిజన్ మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా అంటూ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగాడు. దీనికి శ్రీ లీలా స్పందిస్తూ నేను కమిట్మెంట్ ఇచ్చాను. వృత్తిపరంగా నేను వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తూనే ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ‌లీలా ఇచ్చిన ఈ క్రేజీ ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.