సినిమా ఒప్పుకోవాడానికి శ్రీలీల .. డైరెక్టర్లు అందరికి అలాంటి కండీషన్ పెడుతుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ప్రజెంట్ ఎటువంటి టఫ్ సినిమాలను చూస్ చేసుకుని ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకునిందో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఆమె నటించిన భగవంత్  కేసరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . త్వరలోనే ఆదికేశవ సినిమాతో ఆమె జనాలను పలకరించిపోతుంది .

ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ . అయితే ఇండస్ట్రీలో శ్రీ లీల సినిమా ఒప్పుకోవడానికి ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఒక క్రేజీ కండిషన్ పెడుతుందట . ఆ కండిషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  శ్రీ లీల తన సినిమాలు ఒప్పుకోవడానికి డైరెక్టర్లకి పెట్టే కండిషన్ కాల్ షీత్స్.

ముందుగా అడిగితేనే కాల్ షీట్స్ ఇస్తుందట..సినిమా షూట్ స్టార్ట్ అయ్యాక ఎక్స్ట్రా అడిగితే ఇవ్వను అని చెప్పుకొస్తుందట . అంతేకాదు శ్రీ లీల కాల్ షీట్స్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్ గా ఉంటుందట . ఆమె కామెంట్ ఇచ్చిన సినిమాలు తన వల్ల షూట్ లేట్ అయిన పోస్ట్ పోన్ అయినా చాలా బాధపడుతుందట . అందుకే ముందు నుంచే జాగ్రత్తలు పడుతూ కాల్ షీట్స్ విషయంలో మాత్రం డైరెక్టర్స్ కు తెగేసి చెప్పేస్తుందట..!