లావణ్య కోసం వరుణ్ సంచలన నిర్ణయం..మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.  హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో కొంతకాలంగా ప్రేమాయణం నడిపిస్తున్న ఆయన నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్గా వెడ్డింగ్ డెస్టినీను ప్లాన్ చేసుకున్నారు . రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చాలా చాలా ఘనంగా జరిగాయి . ఇలాంటి క్రమంలోనే వరుణ్ లావణ్య హ్యాపీనెస్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

వీళ్ళ పెళ్లి ఇటలీలో జరుగుతుంది.  ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ – లావణ్య కుటుంబం అందరూ కూడా ఎవరి ఖర్చులు వారు భరించి ఇటలీ వెళ్లాలని డిసైడ్ అయ్యారట . కానీ లావణ్య సలహా మేరకు వరుణ్ అందరి ఖర్చులు తానే భరించే విధంగా మాట్లాడుకున్నారట . “ఇది నా పెళ్లి నా హ్యాపీనెస్ కోసం అందరిని నేనే తీసుకెళ్తాను సరదాగా ఎంజాయ్ చేద్దాం అంటూ మెగా ఫ్యామిలీ -అల్లు ఫ్యామిలీ -లావణ్య ఫ్యామిలీ కు చెప్పుకొచ్చారట”.

అంతేకాదు నిహారిక పెళ్లి విషయంలో మాత్రం ఎవరి ఖర్చులు వాళ్లే  పెట్టుకున్నారు.  కానీ వరుణ్ మాత్రం తన పెళ్లిని ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అంటూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు . దీంతో లావణ్య వరుణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది.