డ‌బ్బు కోసం చ‌చ్చినా ఆ ప‌ని చెయ్య‌ను.. మృణాల్ ఓపెన్ కామెంట్స్‌!

అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ‌.. గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉంది.

తెలుగులో న్యాచుర‌ల్ నానితో క‌లిసి `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లో మృణాల్ న‌టిస్తోంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ మూవీకి క‌మిట్ అయింది. మ‌రోవైపు త‌మిళంలో శివ కార్తికేయ‌న్ కు జోడీగా ఒక ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. అలాగే బాలీవుడ్ లోనూ ఆఫ‌ర్లు అందుకుంటూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న‌ మృణాల్‌.. తాజాగా ఓ భేటీలో పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా మృణాల్ మాట్లాడుతూ.. డ‌బ్బు ఎక్కువ‌గా ఇస్తున్నార‌ని చెప్పి ఒకే భాష‌కే ప‌రిమితమై చ‌చ్చినా సినిమాలు చెయ్య‌న‌ని, అన్ని భాష‌ల్లో అన్ని ర‌కాల పాత్రలు చేయ‌డ‌మే త‌న‌కు ఇష్ట‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. ప్ర‌స్తుతం అనేక భాష‌ల్లో విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్నాని మృణాల్ తెలిపింది. ప్రేక్ష‌కులు కూడా త‌న నుంచి ఇదే కోరుకుంటున్నార‌ని ఆమె పేర్కొంది. మొత్తానికి కెరీర్ విష‌యంలో ఫుల్ ఫ్లానింగ్ తో ఉన్న మృణాల్‌.. ఒకే భాష‌కు ప‌రిమితం అవ్వ‌కుండా ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డుతోంది.