అనుష్క – నాగార్జున ల బంధం ఎక్కడ మొదలైందో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవమన్మధుడిగా ఇప్పటికీ చలామణి అవుతున్న కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ అందం మరింత పెరుగుతూ ఒక వైపు సినిమాలు, మరొకవైపు టీవీ షోలు చేస్తూ మరింతగా క్రేజ్ దక్కించుకుంటున్నారు. మరొకవైపు హీరోయిన్ అనుష్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటికే హీరోయిన్ అనుష్క చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతోపాటు ఇండస్ట్రీలో ఈమె చాలా మంది హీరోలతో మంచి రిలేషన్షిప్ మైంటైన్ చేస్తోందని అందరికీ తెలిసిందే. అందులో మొదటిగా చెప్పాల్సింది నాగార్జున గురించి.. ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అనుష్క ఎక్కువగా నాగార్జున చెప్పిన మాటలు వింటూ ఉంటుంది. ఆయన చెప్పినట్టుగానే సినిమాలు చేస్తుంది అన్న వార్తలు వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించారు. అనుష్క నాగార్జునతో తప్ప వేరే హీరోతో సినిమాలలో సరిగ్గా నటించదు అన్న పేరును కూడా మూటగట్టుకుంది.

ఇకపోతే బరువు పెరగడం వల్ల ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ఆమె మాత్రం భారీగానే క్రేజ్ దక్కించుకుంది. ఇకపోతే అనుష్క, నాగార్జునతో ఎక్కువగా సినిమాలు చేయడానికి కారణం ఏమిటి? వీరిద్దరి మధ్య బంధం ఎక్కడ? ఎప్పుడు మొదలైంది? అనే విషయం వైరల్ అవుతూ ఉంటుంది. సూపర్ సినిమా ద్వారా అనుష్క ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో షూటింగ్ సమయంలో అనుష్క ఇబ్బంది పడుతున్న తీరును గమనించిన నాగార్జున ఆమెకు అన్ని విధాలా దగ్గరుండి నటనలో శిక్షణ ఇప్పించి మరీ సినిమాలో నటించేలా చేశారట. ఇక అప్పటినుంచి నాగార్జున పైన గౌరవం పెంచుకున్న అనుష్క ఆయననే ఫాలో అవుతూ ఆయనతోనే ఎక్కువగా సినిమాలు చేసిందని సమాచారం.