లియో ఫస్ట్ లుక్ లోనే రక్తపాతంతో భయపెట్టిస్తున్న త్రిష..!!

విజయ్ దళపతి హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లియో.. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి అప్డేట్ కూడా ఈ సినిమా పైన హైప్ పెంచేలా కనిపిస్తోంది. లియో సినిమా ఏకంగా 228 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

దళపతి విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రతి ఒక్కరు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి త్రిష కి సంబంధించి అధికారికంగా ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. చివరిగా విజయ్, త్రిష కాంబినేషన్లో 2008లో కురివి అనే సినిమాలో నటించారు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత లియో సినిమాలో కనిపించబోతున్నారు ఈ కారణంగానే ఈ సినిమాకి మరింత బజ్ ఏర్పడుతోంది.

 

తాజాగా లియో సినిమా నుంచి త్రిష ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం తీసుకువచ్చింది ఈ లుక్ లో యాక్షన్ సీక్వెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటున్నట్లుగా కనిపిస్తోంది. ఎవరిదో రక్తం తన మీద పడడంతో ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా త్రిష ఆశ్చర్యపోతున్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఈ పోస్టర్లు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. త్రిష, విజయ్ స్క్రీన్పైర్ ఈ సినిమాకి కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్టర్ సైతం వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Seven Screen Studio (@7_screenstudio)