వైలెన్స్ తో విధ్వంసం సృష్టిస్తున్న విజయ్ దళపతి లియో ట్రైలర్..!!

విజయ్ దళపతి హీరోగా.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం లియో.. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సైతం చిత్ర బృందం ఈ రోజున విడుదల చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా.. అర్జున్ సర్జ్జా ,అర్జున్ దాస్, సంజయ్ దత్ తదితర నటీనటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.

Leo Trailer Date: Makers of Thalapathy Vijay starrer make official announcement with a new poster | PINKVILLA

లియో సినిమా ట్రైలర్ విషయానికి వస్తే మొదట విజయ్ తలపతి చెబుతున్న సైకో డైలాగ్ నుంచి ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది.. గౌతమ్ తిన్ననూరి చెప్పే డైలాగులతో మరింత హైప్ పెంచేస్తోంది. ఇందులో విజయ దళపతి, అర్జున్ దాస్ సైతం చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా కనిపిస్తోంది. త్రిష కూడా తన నటనతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

లియో సినిమాలో వైలెన్స్ తో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలు కూడా చాలానే ఉన్నట్టు కనిపిస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. సరికొత్త కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. సంజయ్ దత్ కూడా మరొకసారి ఈ సినిమాలో విలన్ గా ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ తోనే మంచి హైప్ పెంచేసిన డైరెక్టర్ లోకేష్ కనకరాజు దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ మేరకు రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.