అనుపమ పెళ్లి పై దిమ్మతిరిగే సమాధానం చెప్పేసిన తల్లి సునీత..!!

ఏసిని ఇండస్ట్రీలో నైనా కచ్చితంగా రూమర్స్ అనేవి కామన్గా వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా ఒక హీరో హీరోయిన్ కలిసి ఏవైనా సినిమాలు చేశారంటే కచ్చితంగా వారి మధ్య ఏదో సంథింగ్ ఉన్నట్లుగా పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ రూమర్ల పైన డైరెక్ట్ గా వాళ్లే స్పందించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. మరి కొన్నిసార్లు ఇలాంటి విషయాలను వదిలేస్తూ ఉంటారు. గతంలో హీరో రామ్ పోతినేని పెళ్లి గురించి కూడా పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉండేవి. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితురాలని ప్రేమించి వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.

ఈ విషయం పైన రామ్ కుటుంబ సభ్యులే నమ్మలేనంతగా ఈ విషయాన్ని ప్రచారం చేశారు.. ఇప్పుడు తాజాగా మరొక కుర్ర హీరోయిన్ తో రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. త్వరలోనే రామ్ తో పెళ్లి అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. అందులో హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ.. ఈ రెండు సినిమాలు కూడా పర్వాలేదు అనిపించుకున్నాయి దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ కొట్టిందని వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయం పైన ఇంతవరకు వీరిద్దరు స్పందించలేదు.. కానీ హీరోయిన్ అనుపమ తల్లి సునీత మాత్రం ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎటువంటి నిజం లేదని ఇలాంటి రూమర్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదని చాలా విసుక్కున్నట్లు తెలుస్తోంది. కేవలం తన కూతురు ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే ఉందని తానే స్వయంగా పెళ్లి విషయం పైన ఉంటే చెబుతాను అంటూ తెలియజేసింది. దీంతో ఈ పెళ్లి రూమర్ల పైన ఇక మీదట ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి..