రి ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్స్ గా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ కెరియర్ పరంగా కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్స్.. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు మొదలు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నానంటోంది పవన్ కళ్యాణ్ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈమె అలనాటి నటుడు సుమంత్ మాజీ భార్య. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది.

Why Sumanth Took Divorce?

పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా కమెడియన్ ఆలీ హీరోగా నటించిన గన్ షాట్ అనే చిత్రంతో మొదటిసారి వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రాన్ని ఎస్ వి కృష్ణారెడ్డి తెరకెక్కించారు. తొలిప్రేమ సినిమాతో తిరుగులేని స్టార్డం అందుకున్న ఈమె ఆ తర్వాత ఈమె నటించిన ప్రేమ మనసు ,రావోయి చందమామ సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.దీంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు మహేష్ నటించిన అర్జున్ సినిమాలో అక్క పాత్రలో మెప్పించింది.ఈ సినిమా కూడా ఈమెకు నిరాశనే మిగిలింది. దీంతో వెండితెరకు దూరమైన ఏమే తాజగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు ఇంపార్టెంట్ ఉంటే కచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నట్లు కీర్తి రెడ్డి తెలియజేసినట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి సినిమాతో కీర్తి రెడ్డి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి మరి. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.