రాజావారు రాణి గారు అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరాణా అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో మాస్ హీరోగా పేరు సంపాదించే ప్రయత్నాలు చేసిన ఈయన నటించిన చిత్రాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. భారీ ప్రొడక్షన్ హౌస్ లో నటించిన కిరణ్ అబ్బవరం సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు తాజాగా రూల్స్ రంజాన్ అనే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.
కిరణ్ అబ్బవరం చెప్పినట్టుగానే రూల్స్ రంజాన్ సినిమా ఫండ్ రైడ్ సృష్టిస్తోందని సినిమాలో చెప్పుకోదగ్గ కథ ఉండకపోయినా కామెడీ సన్నివేశాలు డైలాగులతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని ఆడియన్స్ సైతం తెలుపుతున్నారు. మొదటి భాగం బాగా నచ్చిందని సెకండ్ హాఫ్ పర్లేదని పలువురు ఆడియన్స్ తెలుపుతున్నారు. డీసెంట్ హీట్ తో కిరణ్ అబ్బవరం ఈసారి సక్సెస్ కొట్టారని ట్విట్టర్లో టాక్ వినిపిస్తోంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కి పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఇందులో ఆయన లుక్స్ కామెడీ టైమింగ్ చాలా బాగుందని ఇక నేహా శెట్టి అందచందాలు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయని తెలుస్తోంది.
రూల్స్ రంజాన్ సినిమాలో భారీగానే తారాగణం నటించారు హైపర్ ఆది, వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు సైతం కామెడీ బాగా వర్కౌట్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.డైరెక్టర్ రాతిన కృష్ణ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కిరణ్ అబ్బవరం రూల్స్ రంజాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారని తెలుస్తోంది. మరి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ను అందుకుంటారో చూడాలి.