`లియో`కు ద‌ళ‌ప‌తి విజ‌య్ షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌.. పాన్ ఇండియా హీరోలు కూడా దిగ‌దుడుపే!

ద‌ళ‌ప‌తి విజ‌య్ నుంచి త్వ‌ర‌లోనే రాబోతున్న అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `లియో`. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం.. అక్టోబ‌ర్ 19న తెలుగు, త‌మిళ్‌తో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో కూడా విడుద‌ల కాబోతోంది.

విజ‌య్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఇప్ప‌టికే ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల బ‌య‌ట‌కు ట్రైల‌ర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం చిత్ర‌టీమ్ ప్ర‌మోష‌న్స్ తో మ‌రింత హైప్ పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇదిలా ఉంటే.. లియోకు ద‌ళ‌ప‌తి విజ‌య్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పాన్ ఇండియా హీరోలు కూడా దిగ‌దుడుపే అన్న రేంజ్ లో విజ‌య్ పారితోషికం తీసుకున్నాడు. ఇన్‌సౌడ్ టాక్ ప్ర‌కారం.. లియోకు విజ‌య్ ఏకంగా రూ. 120 కోట్లు పుచ్చుకున్నాడ‌ట‌. తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్‌ తర్వాత సెకండ్‌ హయ్యస్ట్‌ రెమ్యునరేషన్‌ ఇదేనని చెబుతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ లేక‌పోయినా విజ‌య్ ఆ రేంజ్ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం అంద‌రికీ షాకింగ్ గా మారింది.