బ్రతిమిలాడుకుని ఆ హీరోయిన్ నే ఫిక్స్ చేసుకున్న సుకుమార్.. ఇక పుష్ప 2 వేరే లెవల్..!!

ఫైనల్లీ పుష్ప2 సినిమాలో ఐటమ్ గర్ల్ సెలెక్ట్ అయిపోయింది. ఇన్నాళ్లు పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేయబోయే హీరోయిన్ ఎవరయితే బాగుంటుందా ..? అంటూ జనాలు బుర్రపీక్కున్నారు. ఫైనల్లీ సుకుమార్ ఓ బ్యూటీని సెలెక్ట్ చేసుకునేసాడు. అంతేకాదు ఆ బ్యూటీ కోసం తెగ కష్టపడ్డాడు . ఆ హీరోయిన్ మరవెరో కాదు ..సమంత…

ఎస్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సినిమాలో ఐటమ్ గర్ల్ పాత్ర చేయబోతుంది సమంత అంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాలో ఆ సాంగ్ ఆమె చేయాలి అంటూ బన్నీ – సుకుమార్ స్పెషల్ రిక్వెస్ట్ చేశారట . ఆ కారణంగానే సమంత పార్ట్ 2 లో కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చేసిందట .

అంతేకాదు ఈసారి ఏకంగా ఈ పాట కోసం ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఈసారి ఐటెం సాంగ్ ఊ అంటావ మావ కి మించిన రేంజ్ లో ఉండబోతుందట..!