అలనాటి హీరోయిన్ సంఘవి పెళ్లిలో ఇన్ని ట్విస్టులా..?

కోలీవుడ్లో , టాలివుడ్ లో కూడా మంచి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్న హీరోయిన్ సంఘవి సుపరిచితమే. సింధూరం, ఊరికి మొనగాడు, ఓహో నా పెళ్ళంట, సీతారామరాజు, సరదా బుల్లోడు తదితర చిత్రాలలో నటించింది. చివరిగా తెలుగులో ఒక్కడే కానీ ఇద్దరు అనే సినిమాతో 2005లో నటించింది ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు. గడచిన నాలుగేళ్ల నుంచి ఈమె సినిమాలో నటించలేదు కానీ ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.

హీరో దళపతి విజయ్ సరసన నటించిన సంఘవి కెరియర్ కు వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. డైరెక్టర్ చంద్రశేఖర్ తన కుమారుడు విజయ్ ని హీరోగా సంఘవి హీరోయిన్గా కలిసి ఒక సినిమాను చేశారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు సినిమాలను కూడా ఇదే కాంబినేషన్లను చేశారట. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని గతంలో వార్తలు వినిపించాయి. అయితే అది నచ్చని విజయ్ తండ్రి ఆ కారణంగా సంఘవికి కోలీవుడ్లో సినిమా అవకాశాలు లేకుండా చేశారని వార్తలు వినిపిస్తూ ఉండేవి.

Actress Sanghavi finally ties the knot with an IT professional

రామానాయుడు, సురేష్ ప్రొడక్షన్ హౌస్ లో ఎన్నో సినిమాలలో నటించింది. అలాంటి సమయంలోనే శివయ్య సినిమా డైరెక్షన్ చేస్తున్న సురేష్ వర్మతో ఇమే ప్రేమలో పడిందట. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి సంఘవి తల్లిదండ్రులకు మాత్రం ఇష్టం లేదట. అప్పటినుంచి ఆమె కుటుంబ సభ్యులతో తెగదింపులు చేసుకొని బయటికి వచ్చేసిందని సమాచారం. ఆ తర్వాత వెంటనే సినిమాలలో అవకాశాలు తగ్గడం ఒక ఏడాదికే భర్తతో వివాదాలు మొదలై ఇద్దరు ప్రస్తుతం విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన భర్త టార్చర్ కారణంగానే ఆమె విడకులు తీసుకుందని అప్పట్లో ఒక విషయం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఐటీ సంస్థ అధినేత వెంకటేష్ 2016లో పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు.