బిగ్ బాస్ 17కి స‌ల్మాన్ ఖాన్ రికార్డు రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కో ఎపిసోడ్ కు అన్ని కోట్లా..?

బుల్లితెర‌పై అత్యంత ప్ర‌జాధార‌ణ పొందిన షోస్‌లో బిగ్ బాస్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఈ రియాలిటీ షో అనేక భాష‌ల్లో ప్ర‌సారం అవుతోంది. మ‌న ఇండియాలో మొట్ట‌మొద‌ట బాలీవుడ్ లో బిగ్ బాస్ షో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే అక్క‌డ 16 సీజ‌న్ల‌ను స‌క్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. `బిగ్‏ బాస్ సీజన్ 17 హిందీ’ అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొంద‌రు పేర్లు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ 17కి స‌ల్మాన్ ఖాన్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2010 నుంచి హిందీ బిగ్ బాస్ కు స‌ల్మాన్ ఖానే వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అప్ప‌ట్లో వీకెండ్ ఎపిసోడ్స్ రూ. 2.5 కోట్లు తీసుకునేవాడు. ఆ త‌ర్వాత ఈ ఫిగ‌ర్ పెరుగుతూ వ‌చ్చింది.

ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 17కు వ‌చ్చే స‌రికి స‌ల్మాన్ రికార్డు స్థాయిలో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక్కో ఎసిసోడ్ కు రూ. 6 కోట్లు పుచ్చుకుంటున్నాడ‌ట‌. వారానికి రెండు ఎపిసోడ్స్‌(శ‌ని, ఆది)లో కండ‌ల వీరుడు క‌నిపించాల్సి ఉంటుంది. అంటే రెండు ఎపిసోడ్స్ గానూ స‌ల్మాన్ ఖాన్ ఏకంగా రూ. 12 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడ‌ట. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. సినిమాల క‌న్నా బిగ్ బాస్ ద్వారా స‌ల్మాన్ ఎక్కువ సంపాదిస్తున్నాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.