ఆరోజున టిల్లు బాయ్ నెక్స్ట్ మూవీ లాంచ్… ఎప్పుడంటే…!!

టాలీవుడ్ సినిమా దగ్గర లేటెస్ట్ షైనింగ్ హీరోస్ లో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకడు. మరి సిద్దు హీరోగా ఇప్పుడు తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ డీజే టిల్లుకి సీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. అయితే తను ఈ సినిమా అనంతరం మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు లైన్ అప్ లో పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాల్లో అయితే మన టాలీవుడ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి నీరజా కోన కాంబినేషన్లో చెయ్యనున్న సినిమా కూడా ఒకటి.

ఆమె దర్శకురాలిగా చేయనున్న మొదటి సినిమాలో సిద్దు హీరోగా నటించనున్నాడు. అలాగే ఈ సినిమా అక్టోబర్ 18న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుందని తెలుస్తుంది. ఇక ఆ రోజున అయితే సినిమా క్రాస్టింగ్ తో సహా ఇతర అంశాలపై మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ఇక సిద్దు గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు.

మొదటి సినిమాతోనే సక్సెస్ అవడం చాలా కష్టం. కానీ ఆ రికార్డుని సిద్దు దక్కించుకున్నాడు. డీజే టిల్లు సినిమాలో తన మాట్లాడిన ప్రాస ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెన్స్ గా రాబోతున్న డీజే టిల్లు 2 ఏ రేంజ్ లో వెళ్తుందో చూడాలి మరి.