లియో సినిమాలోని యాక్టర్ల రెమ్యూనరేషన్…?

దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం లియో.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఈనెల 20 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విక్రమ్ సినిమాతో ఒక సంచలన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజు లియో సినిమాను ఎలా తెరకెక్కించారు అనే విషయంపై అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో విజయ్ పాత్ర ఎలా ఉండబోతోంది. ఇప్పటివరకు లియో సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ టీజర్ ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేశాయి.

Leo: Thalapathy Vijay's Stardom Creates History In Kerala, Theatrical  Rights Sold At An All-Time Record Price?
ట్రైలర్ కూడా అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా హైప్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇందులోని నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారనే విషయంపై అభిమానులు చాలా అద్భుతంగా ఎదురు చూస్తున్నారు. మామూలుగా హీరో విజయ్ రెమ్యూనరేషన్ భారీగానే ఉంటుంది.. ఒక్కో సినిమా షేరింగ్ తో కలిపి దాదాపుగా 80 కోట్ల వరకు అందుకుంటారట.. లియో సినిమా మొత్తం బడ్జెట్ 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.

Big surprise loading in 'Leo' - A superstar to join the cast? - Tamil News  - IndiaGlitz.com

ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 120 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పటివరకు విజయ్ ఈ రేంజ్ లో ఏ రెమ్యూనరేషన్ కూడా అందుకోలేదు.. అలాగే డైరెక్టర్ లోకేష్ 12 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుద్ 10 కోట్ల రూపాయల వరకు అందుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విలన్గా నటించిన సంజయ్ దత్ 8 కొట్లు హీరోయిన్ త్రిష కి 5 కోట్ల రూపాయలు.. యాక్షన్ కింగ్ అర్జున్ కోటి రూపాయలు.. ప్రియ ఆనందుకు 50 లక్షలు ఇతర నటీనటులకు 30 నుంచి 50 లక్షలు ఇచ్చినట్లు సమాచారం.