భగవంత్ కేసరి.. బాలయ్య టార్గెట్ ఎన్ని కోట్లు అంటే..?

నటసింహ బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరీ.. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. పోటీకి ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమాల పైన చాలా హైప్స్ ఏర్పడ్డాయి బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్ ఉంటుందని చెప్పవచ్చు.. అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా అభిమానులలో ఆసక్తి పెంచడంతో మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సినిమా మొదటి రోజు ఎలాంటి టాక్ ఉండబోతోంది అనే విషయం బాక్సాఫీస్ మీద ఆధారపడి ఉంటుంది.

భగవంత్ కేసరి సినిమా ఏరియాలో ఎంత బిజినెస్ చేసిందని విషయానికి వస్తే నైజాం ఏరియాలో 14.5 కోట్ల రూపాయలు బిజినెస్ చేయక సీడెడ్ లో 13 కోట్లు ఉత్తరాంధ్రలో 8 కోట్లు నెల్లూరులో 2.6 కోట్లు.. గుంటూరులో 6 కోట్లు కృష్ణలో 4కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం 57 కోట్ల రూపాయల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 4.25 కోట్ల రూపాయలు పలకగా ఓవర్సీస్ గా ఆరు కోట్లు బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగినట్టుగా సమాచారం.

భగవంత్ కేసరీ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించాలి అంటే 68 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉన్నది.ఒక విధంగా ఈ సినిమా బాలయ్యకు పెద్ద టార్గెట్టే అని చెప్పవచ్చు. కానీ టాక్ పాజిటివ్ వచ్చిందంటే దసరా సెలవులను టార్గెట్ ఉండడంతో ఇలాంటి వాటిని ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఎంతవరకు బాలయ్యకు ఈ సినిమా కలిసొస్తుందో చూడాలి.