సొంత సినిమా టైటిల్ మర్చిపోయిన పవన్ కళ్యాణ్(వీడియో)..ఈయన ఏపీ సీఎం అవుతాడా..?

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మరీ మరీ ముఖ్యంగా అందరి కళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే పడ్డాయి. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా వెళ్ళిపోతున్న పవన్ ను టార్గెట్ చేయడానికి అందరూ ఎక్కువగా చూస్తున్నారు . రీసెంట్గా పవన్ కళ్యాణ్ తెలుగు టీవీ ఛానల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ గురించి కూసింత క్లాస్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ .

అయితే ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా – జర్నలిజం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే వేదికపై పవన్ మాట్లాడుతూ తన సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతల గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తన సినిమా నిర్మాతల పేర్లు చెబుతూ ..”వకీల్ సాబ్ దర్శకుడు దిల్ రాజు ..సర్దార్ భగత్ సింగ్ ఏదో ఉంది సినిమా పేరు అంటూ కొంతసేపు సాగదీశాడు.. ఆ సినిమా పేరు భగత్ సింగ్ అని గుర్తుంది ఆ సినిమా నిర్మాత నవీన్ నుంచి అయితే మద్దతు ఉంటుంది అని తెలియజేశాడు”.

అయితే ఇదంతా ఆయన బిజీ షెడ్యూల్లోని కారణంగా .. ఆయనకు ఉన్న టెన్షన్స్ వల్లే మర్చిపోయారు . కానీ కొందరు పవన్ కళ్యాణ్ ని ఘాటుగా టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నాడు . సొంత సినిమా టైటిల్ మర్చిపోయిన నువ్వు ఏపీకి సీఎం అవుతావా..? ప్రజల బాగోగులు ఏం చూసుకుంటావు..? అంటూ మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో కౌంటర్స్ వేస్తున్నారు . ఇచ్చిన హామీలను మర్చిపోయిన మీ సీఎం కంటే..? సొంత సినిమా టైటిల్ ని సగమైన చెప్పిన మా కాబోయే సీఎం గొప్పనే..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో పవన్ కళ్యాణ్ వీడియో వైరల్ గా మారింది ..!!