లియో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో విజయ దళపతి నటిస్తున్న లియో సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మరింత హైప్ ఏర్పడింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19వ తేదీన విడుదలకు పాన్ ఇండియా లెవెల్లో సిద్ధంగా ఉన్నది. ఇందులో విజయ్ సరసన త్రిష నటిస్తూ ఉన్నది. అలాగే హీరో అర్జున్ సర్జ కూడా విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

Leo (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

తాజాగా ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్గా, నటుడుగా పేరు పొందిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 19వ తేదీన విడుదల కాబోతున్నటువంటి సినిమా మైండ్ బ్లోయింగ్ సినిమా అంటూ తెలియజేశారు. అందులోని తన సన్నివేశాలు కొన్ని చూసాను సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపారు.

విజయ్ వంటి గొప్ప యాక్టర్ తో నటించడం నిజంగానే అదృష్టం డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.. సినిమా షూటింగ్ సమయంలో తాను విజయ్ ని ఎక్కువగా గమనిస్తుండే వాడినని షూటింగ్ 9 గంటలు అంటే లోకేషన్ కి ఆయన ఏడు గంటలకే వచ్చేవారు.. అలా వచ్చి స్క్రిప్ట్ పేపర్ తీసుకొని డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారని తెలిపారు ఆయనకి సినిమా పట్ల ఉన్న అంకిత భావాన్ని ఈ విధంగా తెలియజేశారు గౌతమ్ వాసుదేవ్. కచ్చితంగా ఏ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక చరిత్రను తిరగరాస్తుంది అంటూ ఫస్ట్ రివ్యూ ను తెలియజేశారు. ఇక మొదటే పాజిటివ్ గా రావడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.