సోషల్ మీడియా ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి నటీనటులు పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం సోషల్ మీడియానే అని చెప్పవచ్చు.. ఇలా వచ్చిన పాపులారిటీతోనే పలు సినిమాలలో నటించే అవకాశాలను సైతం అందుకుంటున్నారు. పలు రకాల బ్రాండ్లకు సంబంధించి ప్రమోషన్స్ ను కూడా చేస్తు మంచి పాపులారిటీ అందుకోవడమే కాకుండా భారీగానే సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో అత్యధికంగ సంపాదించి హీరోయిన్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

After Parineeti Chopra's wedding, here's a throwback to cousin Priyanka  Chopra and Nick Jonas' love story | The Times of India

గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఇంస్టాగ్రామ్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్న హీరోయిన్ గా పేరు సంపాదించింది. ప్రియాంక చోప్రా ఒక్కో యాడ్ పోస్ట్ కోసం దాదాపుగా 3 కోట్ల రూపాయలు తీసుకుంటోందట. ఇదంతా ఇలా ఉండగా షారుక్ ఖాన్ కోటి రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆలియా భట్ కూడా కోటి రూపాయలు.. శ్రద్ధా కపూర్ 1.18 కోట్ల రూపాయలు తీసుకోగా.. దీపికా పదుకొనే 1.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Please Kholo': Shah Rukh Khan Teases Deepika Padukone At An Award Show;  Priyanka Chopra's Reaction Is Unmissable- Watch THROWBACK Video

అయితే ఈ ఇన్స్టాగ్రామ్ పారితోషకాల విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ ను బట్టి అది డిసైడ్ అవుతూ ఉంటుందట. ప్రియాంక చోప్రా ఇటీవలే అమెరికన్ వెబ్ సిరీస్ అయినా సీటాడెల్ లో నటించింది. తన నటనతో ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్ పెద్దగా సక్సెస్ కాలేకపోతోందని తెలుస్తోంది. డేట్లు అడ్జస్ట్ చేయలేక కొన్ని సినిమాలను పోస్ట్ ఫోన్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది ప్రియాంక చోప్రా. ఇటీవల తన కజిన్ సిస్టర్ అయిన పరిణితి చోప్రా పెళ్లికి కూడా హాజరు కాలేకపోయింది.