ఆలియా భట్ తన తండ్రి పేరు చెప్పకపోవడానికి కారణం..?

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈమె ప్రముఖ నిర్మాత దర్శకుడు మహేష్ భట్, సోనీ రజ్దాన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె రణబీర్ కపూర్ ను ప్రేమించు మరి వివాహం చేసుకుంది. RRR చిత్రంతోనే తెలుగులో మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ గంగుబాయి కతియావాడి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజ్ అందుకుంది.

From the archives | I always want to be No. 1…I've got a major

ఇప్పుడిప్పుడే కెరియర్ పరంగా ఎలాంటి డోకా లేకుండా ముందుకు వెళుతున్న ఆలియా భట్.. ఇదే బ్రాండ్ తో కొన్నేళ్లపాటు కంటిన్యూ అవ్వడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.. రణబీర్ కపూర్ భార్యగా ఆలియా భట్ ఏం చేసినా చెల్లుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో ఇండస్ట్రీలో ఎంతో కాలం పాటు మహేష్ భట్ పేరు పెద్దగా అలియా భట్ ఎక్కడ చెప్పుకోలేదట.. మహేష్ భట్ ,ఆలియా భట్ కలిసి దిగిన ఫోటోలు కూడా ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు..

 

ఈ విషయం ఎన్నో సార్లు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో తన తండ్రితో ఆలియా భట్ కి విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి.. కానీ అసలు సంగతి వేరే ఉందట.. తాజాగా ఆలియా భట్ మాటలని బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతంలో తన తండ్రి చాలా సినిమాలను నిర్మించారు.. అందులో కొన్ని ఫ్లాప్ అయ్యాయి దీంతో ఆర్థికంగా దెబ్బతిన్నారట. ఆ సమయంలో తన తండ్రి మద్యానికి బానిసై..కొన్నాళ్లకు ఎలాగోలాగా ఆ మత్తు నుంచి బయట పడ్డారట.. ఆ తర్వాత తమ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారని అన్నిటిని దాటుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని తెలిపింది. అయితే ఆలియా భట్ మాటలు బట్టి చూస్తే ఈమె ఎదుగుదలకు తన తండ్రి చేసింది ఏమీ లేదని వార్తలు వినిపిస్తున్నాయి. సొంతంగానే పైకి ఎదిగిందని చెప్పవచ్చు. అందుకే తన తండ్రి పేరు ఎక్కడ చెప్పుకోలేదని సమాచారం.