వరుణ్ పెళ్ళి విషయంలో నాగబాబు కీలక నిర్ణయం.. అలా మాత్రం చేయడట..ఎందుకంటే..?

త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే . హీరోయిన్ లావణ్య త్రిపాఠిను ప్రేమించిన ఆయన రీసెంట్ గానే తమ ప్రేమ విషయాన్ని ఓపెన్ గా బయట పెట్టాడు . నాగబాబు నివాసంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారు . అయితే ఇలాంటి మూమెంట్లోనే నాగబాబు వరుణ్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .

మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి వరుణ్ చాలా హ్యాపీగా ఉండాలి అంటే నిహారిక పెళ్లిలో చేసిన తప్పు చేయకూడదు అని ఫిక్స్ అయిపోయాడట . నిహారిక పెళ్లిలో ఫోటోషూట్స్ అంటూ ముహూర్తం దాటిపోయిన తర్వాత చైతన్య మెడలో తాళి కట్టారు. ఆ కారణంగానే వీళ్లు విడాకులు తీసుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

అయితే వరుణ్ విషయంలో మాత్రం ఆ తప్పు చేయదలచుకోవట్లేదు నాగబాబు. ఫోటోషూట్స్ కన్నా ఇంపార్టెంట్ అయిన ముహూర్తానికి ఎక్కువ వాల్యూ ఇచ్చి సరిగ్గా పంతులు పెట్టిన ముహూర్తానికే లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసేలా వరుణ్ ప్లాన్ చేస్తున్నాడు . దీంతో ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!