బన్నీ – త్రివిక్రమ్ సినిమాలో ఆ క్రేజీ బ్యూటీ… ఊహించ‌ని కాంబినేష‌న్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెన్స్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తర్వాత బన్నీ – త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడని న్యూస్ అధికారికంగా ప్రకటించారు మూవీ టీం.

Bunny Vas opens up about Allu Arjun's next with Trivikram - News - IndiaGlitz.com

ఈ సినిమా షూటింగ్ 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వబోతుందని న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఓ క్రేజీ బ్యూటీని తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవ‌రో కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ దీపికా పదుకొణే. బన్నీకి జంటగా దీపిక‌ను ఈ మూవీలో చూపించబోతున్నారట. ప్రస్తుతం దీపిక పదుకొణే ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అలాంటి హీరోయిన్ బన్నీ సరసన నటిస్తూ అతనికి దీటుగా స్టెప్స్ వేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

Deepika Padukone - Wikipedia

 

అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోబోతున్నారట. కాగా పూజా హెగ్డే తీసుకుంటే అల వైకుంఠపురం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక‌ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్, గీత ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్. ఎస్ థ‌మ‌న్‌ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. దీపిక ఈ సినిమాలో హీరోయిన్ అన్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.