సూర్యకాంతం అంతక్రియలకు అప్పటి సిని పెద్దలు ఎవరు వెళ్లలేదట? చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!!

నిజానికి చెప్పాలంటే సూర్యకాంతం పేరు చెబితేనే జనాలు హడలిపోతారు. ముఖ్యంగా ఈ పేరు పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. గయ్యాళితనం అనే పదానికి మీనింగ్ సూర్యకాంతమే అనే విధంగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటీమణి సూర్యకాంతం. తెరపై సూర్యకాంతంల ఉన్నప్పటికీ తెర వెనుక అన్నపూర్ణాల ఉండేదట. అందరిని ప్రేమగా, కలుపుకుపోయేదట.

అయితే ఆమె మరణించినప్పుడు అప్పట్లో ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరు ఆమె చివరి చూపు కోసం వెళ్లలేదట. దానికి కారణం ఆమె లాస్ట్ రోజుల్లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు అంటూ జనాలు చెప్పుకొచ్చారు. గౌరవాన్ని కూడా దక్కించుకోలేకపోయింది సూర్యకాంతం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదట. అప్పట్లో ఆమెతో కలిసి నటించిన స్టార్స్ కూడా ఆమెని దూరం పెట్టేశారట. అంతలా ఆమె ఆఖరి రోజుల్లో.. తీసుకున్న కొన్ని నిర్ణయాలు జనాలకు నచ్చలేదు.

ఆఖరికి ఆమె చనిపోయినప్పుడు కూడా ఎవ్వరూ రాలేదట. అంత గొప్ప నటీమణికి దయనీయమైన పరిస్థితుల్లో అంత్యక్రియలు జరిగాయని ఇప్పటికీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు.ఈమె నటించిన గుండమ్మ కథ సినిమా ఇప్పటి తరం దర్శకులు తీయ్యకపోవడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే ఆ సినిమాలో ఇతర నటీనటులను రీ ప్లేస్ చేసే నటులు ఉన్నారేమో కానీ.. గుండమ్మ పాత్రను చేసే నటులు ఇంకా పుట్టలేదని ఈ సినిమాని ఏ డైరెక్టర్ కూడా టచ్ చెయ్యలేదట. అది సూర్యకాంతం నటన గొప్పతనం. ఏదేమైనప్పటికీ సూర్యకాంతం ఆఖరి క్షణాలలో ఇలా జరగడం చాలా బాధాకరం.