క్యాన్సర్ ను సైతం నయం చేసి సీతాఫలం ఉపయోగాలు తెలుసా..?

ప్రతి ఒక్కరీ ఆరోగ్యం వారు తీసుకొనే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు అందుకే చాలామంది వైద్యుల సైతం పోషకాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని తెలియజేస్తూ ఉంటారు. అయితే పలు రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదట. ముఖ్యంగా సీజనల్ గా దొరికేటువంటివి ఫ్రూట్స్ తినడానికి చాలామంది ఎక్కువగా ఆత్రుతగా ఉంటారు. చలికాలంలో ఎక్కువగా దొరికేటువంటి పనులలో సీతాఫలాలు కూడా ఒకటి.


సీతాఫలం ఆకలి తీర్చడమే కాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలు కూడా త్వరగా శరీరానికి అందించేలా సహాయపడుతుంది. సీతాఫలం తిన్న తర్వాత పారేసే గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే శక్తి సీతాఫలానికి చాలా ఉందట.. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంపొందించే సీతాఫలం ఒక సంజీవనిల పనిచేస్తుందట. సీతాఫలం తినడం వల్ల నోటిలోని జీర్ణ రసాలను సైతం పెంపొందించేలా చేస్తుంది. దీని ద్వారా జీర్ణక్రియ వేగవంతం చేస్తుంది.

సన్నగా ఉండేవారు బరువు పెరగాలనుకుంటే సీతాఫలం జూసులోకి తేనె,పాలు కలుపుకొని కొద్దిరోజులు తాగితే కచ్చితంగా క్యాలరీలు పెరుగుతాయట.

గర్భవతిగా ఉన్నవారు పెరిగే శిశువు యొక్క మెదడు నాడి వ్యవస్థ మీద వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి సీతాఫలం సహాయపడుతుంది.

సీతాఫలంలో ఎక్కువగా ఫైబర్ కాపర్ వంటివి అధికంగా లభిస్తాయి దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఫైబర్ వల్ల మలబద్దక సమస్యను నివారిస్తుంది.

ఐరన్ అధికంగా ఉండడం వల్ల అనీమియా వ్యాధిని నివారిస్తుంది సీతాఫలం తినడం వల్ల దంతాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయట.

స్కిన్ ఎలర్జీ స్కిన్ క్యాన్సర్ రాకుండా సీతాఫలం సహాయపడుతుంది.