అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున‌ ‘ భగవంత్ కేసరి ‘.. రిలీజ్ డేట్ ఇదే..

బాలయ్య ఇటీవల నటించిన మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దసరా బరిలో ర‌వితేజా టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఆ రెండు సినిమాల‌పై అదిప‌త్యం సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.65 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను కొల‌గొట్టింది.

ఈ మూవీ ప్ర‌స్తుతం రూ.100 కోట్ల కలెక్షన్ల వైపుకు దూసుకుపోతుంది. ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భగవంత్ కేసరి ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లో ఓటిటి పార్ట్నర్ వేదికపై అమెజాన్ ప్రైమ్ లోగోను ముందుగానే ప్ర‌ద‌ర్శించారు. దీంతో అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న సంగతి అర్థం అయిపోయింది.

అయితే ఇటీవల భగవంత్‌ కేసరి ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఓటీటీ పార్ట‌న‌ర్స్‌. భగవంత్ కేసరి నవంబర్ 23న ఓటీటీ వేదికపై ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంకా థియేటర్స్ లో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతున్న భగవంత్ కేసరిని అంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేయడం పై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే థియేట‌ర్స్‌లో మూవీ చూసిన‌ కొంత‌మంది ఫ్యాన్స్ మాత్రం ఓటీటీ వేదిక‌పై మ‌రోసారి మూవీ ఎంజాయ్ చేయాల‌ని వేచిచూస్తున్నారు.