” సైందవ్ ” తో పాటు టాలీవుడ్ లో రిలీజ్ అయిన తండ్రి, కూతురు సెంటిమెంట్ మూవీస్ ఇవే…!!

ఏ తండ్రికైనా కూతురు, కొడుకు ఉన్నారంటే.. ఇద్దరిలో ఒక పావు కేజీ ప్రేమ కూతురుపైనే ఎక్కువ చూపిస్తాడు తండ్రి. దీనిని నిజజీవితంలో మనందరం చూస్తూనే ఉంటాం. తండ్రి, కొడుకుల బంధం కంటే తండ్రి, కూతుర్ల బంధమే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది వినడానికి కూడా చాలా క్యూట్ గా స్వీట్ గా ఉంటుంది.

అందుకే ఇలాంటి నేపథ్యంలో కొన్ని సినిమాలు సైతం రిలీజ్ అయ్యాయి. గతంలో రిలీజ్ అవ్వడమే కాకుండా ప్రస్తుత కాలంలోనూ రానున్నాయి. సైందవ్, హాయ్ నాన్న లాంటి సినిమాలు త్వరలో రానున్నాయి. గతంలో తండ్రి, కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాలు.. ఏవి ఫ్లాప్ అయ్యాయో ఏవి హిట్ అయ్యాయో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

1. రాముడు:
మోహన్ బాబు హీరోగా సౌందర్య, రచన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కూతురి పాత్రలో ప్రత్యూష నటించింది. 1998లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ని దక్కించుకుంది.

2. దేవీ పుత్రుడు:
వెంకటేష్ హీరోగా సౌందర్య, అంజలి జావేరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కూతురి పాత్రలో బేబీ చెర్రీ నటించింది. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

3. డాడీ:
చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో అనుష్క మల్హోత్రా కూతురు పాత్రలో నటించింది. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ ని దక్కించుకుంది.

4. విక్రమార్కుడు:
రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా 2006లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కూతురు పాత్ర నటించింది చిన్నారి బేబీ నేహా. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని దక్కించుకుంది.

5. నాన్న:
విక్రమ్ హీరోగా అమలా పాల్, అనుష్కలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కూతురు పాత్రలో సారా అర్జున్ నటించింది. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది.

ఇలా తండ్రి, కూతుర్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.. అయినప్పటికీ ఆ సినిమాలపై అభిమానం ఇప్పటికీ, ఎప్పటికీ పోదు. తరచూ ఆ సినిమాల్లోని పాటలు వినిపిస్తూనే ఉంటాయి. దీని బట్టి చూసుకుంటే తండ్రి, కూతుర్ల అనుబంధం ఎంత ముచ్చటైనదో తెలుస్తుంది.